![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -375 లో.. ముకుందకి నిజంగానే ఆదర్శ్ రావడం ఇష్టమేనా అనే డౌట్ తో.. తన దగ్గరికి ఏదో ఒక రీజన్ తో మధు వచ్చి కనుక్కోవాలని వస్తాడు. కానీ ముకుందకి తనపై మధుకి డౌట్ వచ్చిన విషయం అర్థం అవుతుంది. ఆ తర్వాత ముకుంద వాళ్ళ నాన్న ఫోన్ చేసి.. తన బాగోగులు కనుక్కుంటాడు. ఆదర్శ్ వస్తున్నాడంట కృష్ణ మురారి లు తీసుకొని రావడానికి వెళ్లారని ముకుంద డల్ గా చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి దగ్గరి వరకు వచ్చారు అంటా అని అందరు చాల హ్యాపీగా ఫీల్ అవుతుంటే ముకుంద డల్ గా ఉందేంటని భవాని అనుకుంటుంది. ఆ తర్వాత తనపై డౌట్ వస్తుందని అనుకోని.. ఎక్కడ వరకు వచ్చారు అంటు ముకుంద కనుక్కుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఆదర్శ్ ని తీసుకొని ఇంటికి వస్తారు. గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. అందరు ఆదర్శ్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంటే అతను మాత్రం భవాని దగ్గరికి వెళ్తాడు. ఇన్ని రోజులు నీకు ఈ ఇల్లు గుర్తుకు రాలేదా అంటూ భవాని తన ప్రేమని వ్యక్తం చేస్తుంది. ఎవరో పిలిస్తే గాని నీకు రావాలనిపించలేదా అని భవాని అనగానే.. ఎందుకు రాలేదో నేను చెప్తాను. ఇక్కడ ఉండడం అవసరం లేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఒక మనసు తన కోసం చూస్తుందని వచ్చాడని మధు అనగానే.. అందరు నవ్వుతారు. నిజం చెప్పావ్ మధు అంటు ఆదర్శ్ ని ముకుంద ముందుకు కృష్ణ నెడుతూ.. ఇన్ని రోజులు దూరంగా ఉంది సరిపోదా? ఇప్పుడు కూడా దూరంగా ఉన్నావని ఆదర్శతో కృష్ణ అంటుంది. ఆదర్శ్ ముకుంద వంకే చూస్తుంటాడు. ముకుంద మాత్రం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడేదంటు టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత ఫ్రెషప్ అయి వస్తామంటూ కృష్ణ మురారి ఇద్దరు వెళ్తారు. అందరు వెళ్ళండి నేను ఆదర్శ్ తో మాట్లాడాలని భవాని అంటుంది. నువ్వు నీ ఇష్టప్రకారం గానే వచ్చావా అని ఆదర్శ్ ని భవాని అడుగుతుంది. కృష్ణ నాకు జరిగింది మొత్తం చెప్పింది. ముకుంద మనసులో నేను ఉన్నానని తెలిసి వచ్చానని ఆదర్శ్ చెప్తాడు. ఆ తర్వాత ముకుంద దగ్గరికి ఆదర్శ్ వెళ్లి సారీ అని చెప్పగానే .. నాకు ఎందుకు సారి చెప్తున్నావని ముకుంద అడుగుతుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను అర్ధం చేసుకోకుండా ఆవేశంలో ఇంట్లో నుండి వెళ్ళిపోయానని ఆదర్శ్ అంటాడు. తరువాయి భాగంలో ఆదర్శ్ కి వడ్డించబోతుంటే ముకుంద వడ్డిస్తే చూడాలని ఉందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |